ఒడిశాలో గూడ్స్ రైలును ఢీకొట్టింది కోరమండల్ ఎక్స్‌ప్రెస్. చెన్నై నుంచి హౌరా వెళ్తుండగా కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగింది. 5 బోగీల పట్టాలు తప్పాయి. ఇక ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు కాగా, వందల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు. బాలాసోర్‌కు 40కి.మీ దూరంలో ఈ ప్రమాదం జరిగింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… ఘోర రైలు ప్రమాదంలో ఏకంగా 233 మంది మరణించినట్లు సమాచారం అందుతోంది.
ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, అయితే ఒడిస్సా రైలు ప్రమాదం పై ప్రధాని మోడీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ప్రధాని మోడీ. అలాగే రైలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఎక్స్రేసియా కూడా ప్రకటించారు ప్రధాని మోడీ. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలను ప్రకటించారు. అలాగే రైల్వే శాఖ నుంచి… మరణించిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షల రూపాయలు, తక్కువ గాయాలు అయిన వారికి 50 వేల రూపాయలను ప్రకటించింది రైల్వే శాఖ.