ఫకీర్లను ప్రశ్నలు అడగొద్దు…. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ ట్వీట్

-

దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తోంది. ఈరోజు ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఎంపీ రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. కేంద్రం పెట్రోల్ ధరలను తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. కేంద్రం దిగివచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ నిరసనలు కొనసాగిస్తుందని ఆపార్టీ నేతలు కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు. 

తాజాగా రాహుల్ గాంధీ, ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ… ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యాలు చేశారు. పెట్రోల్ రేట్ల పెరుగుదలపై రాహుల్ గాంధీ ఈ  ట్విట్ చేశారు. ‘ ఫకీర్లను ప్రశ్నలు అడగవద్దని, కేవలం కెమెరాల ద్వారా జ్ఞానాన్నిపెంచుకోవాలి’ అని ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు. భారత్ ను దోచుకుంటున్నారని విమర్శించారు. వివిధ దేశాల్లో పెట్రోల్ రేట్లను ట్విట్ లో జత చేశారు రాహుల్ గాంధీ.

ఆఫ్ఘనిస్తాన్ రూ. 66.99, పాకిస్థాన్ లో రూ. 62.38, శ్రీలంకలో రూ. 72.96, బంగ్లాదేశ్ లో రూ. 78.53, భూటాన్ లో రూ. 86.28, నేపాల్ లో రూ. 97.05, ఇండియాలో రూ. 101.81గా పెట్రోల్ ధరలు ఉన్నాయని ట్విట్ లో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news