మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం మరో 20 రోజులలో కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు శివసేన ( యూబిటీ ) నేత సంజయ్ రౌత్. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు బిజెపితో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ఇప్పటికే డెత్ వారెంట్ జారీ అయిందని విమర్శించారు. ఆ ప్రభుత్వం రానున్న 20 రోజులలో కుప్పకూలి పోతుందని చెప్పారు. తమ పార్టీ కోర్టు ఆదేశాల కోసం చూస్తుందని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.
16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ల పై సుప్రీంకోర్టు తీర్పు రావలసి ఉన్న సంగతి తెలిసిందే. ఇక షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఫిబ్రవరిలో కూలిపోతుందని గతంలో కూడా సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. గ తేడాది జోన్ 30న షిండే ముఖ్యమంత్రిగా, బిజెపి నేత దేవేంద్ర పద్మవ్యూస్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.