కునో పార్కులో చీతాల మృతి.. సౌత్ ఆఫ్రికా రియాక్ష్ ఇదే!

-

దక్షిణాఫ్రికా నుంచి చీతాలను తీసుకువచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కు లో ఉంచిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఓ చీతా మృతి చెందడంపై సౌత్ ఆఫ్రికా అటవీ, మత్స్య, పర్యావరణ శాఖ స్పందించింది. ఇలాంటివి జరుగుతాయని ప్రాజెక్టు ప్రారంభంలోనే ఊహించామని పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ పర్యావరణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘ పెద్ద పెద్ద మాంసాహార జంతువులను ఒక చోటు నుంచి మరో చోటుకి తరలించడం, వాటిని అక్కడ పెంచడం చాలా సంక్షిష్టమైన పని. అంతేకాకుండా కొన్ని జంతువులు కొత్త వాతావరణానికి అలవాటు పడలేవు. పరిసరాలు కూడా వాటిపై ప్రభావం చూపిస్తాయి. ఈ క్రమంలో కొన్ని ప్రాణాలు కోల్పోతాయి’’ అని ప్రకటనలో పేర్కొంది.

భారత్‌లో చీతాలు మృతి చెందడానికి గల కారణాల కోసం వేచి చూస్తున్నట్లు దక్షిణాఫ్రికా వెల్లడించింది. తాజాగా మృతి చెందిన చీతా శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాత దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తామని చెప్పింది. అయితే, చీతాల మృతికి అంటువ్యాధులు కారణమై ఉండొచ్చన్నదానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని డీఎఫ్‌ఎఫ్‌ఈ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version