World Cup 2023 : పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్

-

World Cup 2023 : పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది.  వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ ఓటములతో పేలవ ప్రదర్శన చేస్తున్న పాకిస్తాన్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మొకాలి గాయంతో బాధపడుతున్న ఆ జట్టు స్టార్ ఓపెనర్ జమాన్ నేడు దక్షిణాఫ్రికాతో జరగనున్న మ్యాచ్ కు దూరమయ్యారు.

Star Pakistan Opener Fails to Recover From Knee Injury

గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ వరల్డ్ కప్ లో జమాన్ కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడారు. ఇది ఇలా ఉండగా… ఈ టోర్నమెంట్లో భాగంగా ఇవాళ సౌత్ ఆఫ్రికా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది.

ఇక ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం లో జరుగుతుంది. ఎప్పటిలాగే ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది.అయితే ఈ మ్యాచ్ లో గెలవడం పాకిస్తాన్ జట్టుకు చాలా కీలకం. ఇందులో ఓడితే పాకిస్తాన్ కచ్చితంగా ఇంటికి వెళ్తుంది. మరి ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version