తీహార్ జైలుకు స్వాగతం.. కేజ్రీవాల్ కు సుకేశ్ లేఖ

-

జైలు నుంచి సీఎం కేజ్రీవాల్‌కు సుఖేష్‌ చంద్రశేఖర్‌ లేఖ రాశారు. తీహార్‌ క్లబ్‌కు బాస్‌గా మీకు స్వాగతం పలుకుతున్నా అంటూ లేఖలో పేర్కొన్నారు. నాలుగు కుంభకోణాల్లో నేనే సాక్షిగా ఉన్నా.. అప్రూవర్‌గా మారి నిజాలు బయటపెడతానని హెచ్చరించారు సుఖేష్‌ చంద్రశేఖర్‌. ఇప్పుడు ఈ లేఖ హాట్‌ టాపిక్‌ గా మారింది.

Sukesh Chandrasekhar’s letter to CM Kejriwal from jail

ఇదిలా ఉంటే.. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మార్చి 28 వరకు కేజ్రీవాల్ కి ఈడీ కస్టడీ విధించింది. 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది రౌస్ అవెన్యూ కోర్టు. ముఖ్యంగా   ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటలకు  కేజ్రీవాల్ ని కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version