BREAKING : వివాహాల రద్దు పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. విడాకుల ఫాస్ట్ ట్రాక్ కు అంగీకరించిన సుప్రీంకోర్టు.. వివాహాల రద్దు పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది.
కలిసి జీవించలేనంతగా వివాహం విచ్చిన్నమైన పరిస్థితులు ఉంటే ఆర్టికల్ 142 కింద విడాకులు మంజూరు చేయవచ్చని తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. విడాకుల ప్రక్రియను ఫాస్ట్ ట్రాక్ చేయవచ్చు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులకు కనీసం ఆరు నుంచి 18 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రత్యేక అధికారం కింద విడాకులను ఫాస్ట్ ట్రాక్ గా మంజూరు చేసే అధికారం స్పష్టం చేసింది.