నిన్న ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 277 పరుగులను ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా. ఈ విజయంతో అన్ని ఫార్మాట్స్ లో నెంబర్ ర్యాంక్ లో టీం ఇండియా నిలిచింది.
ICC ర్యాంకింగ్స్ లో ఇప్పటికే T20, టెస్టుల్లో టాప్ ప్లేస్ లో ఉన్న టీమిండియా…నిన్న ఆస్ట్రేలియా పై విజయంతో వన్డేల్లో కూడా నెంబర్ వన్ ర్యాంక్ లో నిలిచింది. వన్డేల్లో టాప్ లో ఉన్న పాకిస్తాన్ ని వెనక్కి నెట్టి నెంబర్ వన్ గా నిలిచింది టీమిండియా. ఆసియా కప్ కొట్టడంతో పాటు.. ఆస్ట్రేలియా తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో గెలిచి టాప్ పొజిషన్ కి చేరింది ఇండియన్ టీం.
అటు ఐసీసీ వన్డే బౌలింగ్ లో నెంబర్ వన్ స్థానంలో సిరాజ్ కొనసాగుతున్నాడు. T20 బ్యాటింగ్ లో నెంబర్ వన్ ర్యాంక్ లో సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు. టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా రవీంద్ర జడేజా… టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్ గా అశ్విన్, వన్డే బ్యాటింగ్ లో సెకండ్ ప్లేస్ లో శుబ్ మన్ గిల్ ఉన్నాడు.