World Cup 2023 : కేఎల్ రాహుల్ సెంచరీ మిస్ కావడంపై.. హార్దిక్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసీస్ తో మ్యాచ్లో కేఎల్ రాహుల్(97) సెంచరీ కాకుండా హార్దిక్ అడ్డుకున్నారు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. 39వ ఓవర్లో సిక్స్ కొట్టిన పాండ్యా ఆ సమయంలో రాహుల్ కు స్ట్రైకింగ్ ఇచ్చి ఉంటే సెంచరీ పూర్తి చేసుకునేవారని విమర్శిస్తున్నారు. గతంలో WIతో సిరీస్ లో తిలక్ వర్మను(49) కూడా హాఫ్ సెంచరీ చేయకుండా పాండ్యా ఇలానే చేశారని అంటున్నారు.
అయితే నెట్ రన్ రేటు కోసమే హార్దిక్ అలా చేశారని అతని ఫాన్స్ చెబుతున్నారు. కాగా, వరల్డ్ కప్ లో భారత్ బోనీ కొట్టింది. ఆస్ట్రేలియాపై ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 200 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియాను ఆసీస్ మొదట్లోనే మూడు వికెట్లు తీసి దెబ్బకొట్టింది. తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ(85), రాహుల్(97*) భారత్ ను విజయతీరాలకు చేర్చారు. చివర్లో కోహ్లీ అవుట్ కాగా…. పాండ్యా(11*)తో కలిసి రాహుల్ ఇండియాను గెలిపించారు. 41.2 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని చేదించి, అదరహో అనిపించింది.