సిద్దూని కేబినెట్ తీసుకోవాలని కోరిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్…. కెప్టెన్ అమరిందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు…

-

ఎన్నికలకు మరో నెల రోజులే గడువు ఉండటంలో 5 రాష్ట్రాల్లో రాజకీయ వేడి పెరిగింది. పంజాబ్ లో చతుర్ముఖ పోరు నెలకొంది. ఆప్, కాంగ్రెస్, బీజేపీ- పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాళీ దళ్ మధ్య పోటీ నెలకొంది. తాజాగా పంజాబ్ లోక్  కాంగ్రెస్ ఛీఫ్, మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్, కాంగ్రెస్ పంజాబ్ పీపీసీ ప్రెసిడెంట్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాకు ఓ మెసేజ్ వచ్చిందని… ‘‘మీరు సిద్దూని కేబినెట్ లోకి తీసుకోండి. సిద్దూ నాకు పాత మిత్రుడని.. ఒక వేళ పని చేయకపోతే తొలగించండంటూ… పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కోరారు’’ అని అమరిందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో కూడా సిద్దూ పై అనేక రకాల విమర్శలు చేశారు అమరిందర్ సింగ్. పాకిస్తాన్ వంటి దేశానికి సరిహద్దుల్లో ఉన్న పంజాబ్ వంటి రాష్ట్రానికి సిద్దు నాయకత్వం సరైంది కాదని హెచ్చరించారు. సిద్దూ ఎప్పుడు పాకిస్తాన్ కు అనుకూలంగానే వ్యవహరిస్తారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సీఎంగా ఉన్న అమరిందర్ సింగ్, సిద్దూకు పడకపోవడంతోనే కాంగ్రెస్ అధిష్టానం కెప్టెన్ ను సీఎం పదవి నుంచి తొలగించింది. దీంతో ఆయన కొత్తగా పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.

Read more RELATED
Recommended to you

Latest news