Nayanthara: ఫ్యాన్ కు బ్యాడ్ న్యూస్..సినిమాలకు గుడ్ బై..కారణం..?

-

ఈ ఏడాది జూన్ నెలలో నయనతార తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్నది. ప్రస్తుతం వీరిద్దరి దాంపత్య జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే వివాహం తర్వాత నయనతార సినిమాలకు పుల్ స్టాప్ పెడుతుందని వార్తలు చాలా రోజుల నుంచి బాగా వినిపిస్తున్నాయి. కేవలం తను కమిట్మెంట్ అయిన కొన్ని చిత్రాలను మాత్రమే చేసి ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అన్నట్లుగా సమాచారం. ఇటీవల నయనతార కుటుంబం సన్నిహితుల నుంచి తన మనసులో ఉండే కోరికను బయటపెట్టిందట. వాటి గురించి చూద్దాం.

నయనతార ప్రస్తుత వయసు 37 సంవత్సరాలు దీంతో పిల్లల్ని కనేందుకు కూడా ఇదే సరైన సమయమని నయనతార భావిస్తున్నదట. ఇక విఘ్నేష్ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలని భావిస్తూ ఉండడంతో దీంతో నయనతార సినిమాలను మానివేసి తన సొంత ప్రొడక్షన్ లోనే సినిమాలను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. లేడీ హీరోయిన్ లలోనే సౌత్ లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకొనే హీరోయిన్గా పేరు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. వయసు పెరుగుతున్న కూడా అందం మాత్రం తగ్గలేదు నయనతారకు. అయితే చివరిగా మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో అన్నా చెల్లెలు నటించారు.

ఇక ఈ చిత్రమే నయనతారకు చివరి చిత్రం అంటూ పలు రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో మాత్రం షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటిస్తోంది. ఇక వీటితోపాటు తమిళంలో రెండు చిత్రాలు చేయవలసి ఉందట. ఈ సినిమాలు అయిపోయిన వెంటనే తన సినిమాలకు స్వస్తి చెప్తోంది అన్నట్లుగా సమాచారం. మరి ఈ వార్తలు విన్న అభిమానుల సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలి అంటే విగ్నేష్, నయనతార ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version