ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు.. 40 లక్షల మందికి లబ్ధి

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుభవార్త చెప్పారు. వచ్చే ఏప్రిల్ మాసం నుంచి కొత్త పింఛన్లను అందజేస్తామని మంత్రి కేటీఆర్ తాజాగా ప్రకటన చేశారు. ఇప్పటివరకు పింఛను రాని వారికి ఏప్రిల్ మాసం నుంచి ఇవ్వనున్నామని పేర్కొన్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించి, కొత్తవి మంజూరు చేస్తామని ప్రకటన చేశారు. టిఆర్ఎస్ సర్కార్ పింఛన్ మొత్తాన్ని 200 రూపాయల నుంచి 2000 వరకు ఉందని గుర్తు చేశారు. గతంలో ఏడాదికి ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేస్తే కేసీఆర్ సర్కార్ వచ్చాక ఏడాది ఏకంగా 10 వేల కోట్లు ఖర్చు చేస్తోందని స్పష్టం చేశారు. గతంలో లబ్ధిదారులు 29 లక్షల మంది ఉండేవారని… కానీ అదనంగా మరో 11 లక్షల మందితో మొత్తం 40 లక్షల మందికి పింఛను అందజేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ సర్కార్ ఎప్పుడూ..  తెలంగాణ ప్రజల కోసమే..  పని చేస్తుందని చెప్పారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news