తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జిలు నియామకం

-

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జడ్జిలను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్రపతి ఆమోదంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జడ్జిలను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇందులో నలుగురిని జడ్జిలుగా, ఇద్దరిని అదనపు జడ్జిలుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జడ్జిలుగా నియమితులైనవారిలో ఏనుగుల వెంకట వేణుగోపాల్, నాగేశ్ భీమపాక, పుల్లా కార్తీక్ అలియాస్ పి ఎలమందర్, కాజ శరత్ ఉన్నారు.

High Court brake for municipal poll notification till 5 pm today

రెండేండ్ల పాటు అదనపు జడ్జిలుగా జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్ రావును నియమించారు. అడ్వకేట్ కోటా నుంచి పదోన్నతి కల్పించాలని వీళ్ల పేర్లను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం
కేంద్రానికి సిఫార్సు చేసింది. సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర హైకోర్టు జడ్జిల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచారు. ప్రస్తుతం 27 మంది జడ్జిలుండగా తాజా నియామకంతో జడ్జిల సంఖ్య 33కు చేరనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news