కొత్త ట్రాఫిక్ నిబంధనలు ( New Traffic Rules ) వచ్చాయి. ఇక తప్పనిసరిగా ఈ రూల్స్ ని పాటించాలని అధికారులు చెబుతున్నారు. కేంద్ర నిబంధనలు పాటించకపోతే ఇక నుండి మరింత కష్టమవుతుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులుకి రాష్ట్రాల్లోని సంబంధిత విభాగాలు ఇక నుండి 15 రోజుల్లోగా నోటీసు జారీ చేయాల్సిందిగా కేంద్రం సూచించింది.

అయితే చలాన్ లో ఉండే డబ్బుని పే చేయకపోతే వాహనదారుడు చెల్లించే వరకూ కూడా ఎలక్ట్రానిక్ రికార్డును జాగ్రత్తగా ఉంచాలని కేంద్రం చెప్పింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ కొత్త నియమాలను అమల్లోకి తీసుకొస్తూ నోటిఫికేషన్ ని జారీ చేయడం కూడా జరిగింది. మోటార్ వాహన చట్టం 1989 ఇటీవల సవరణలు చేసిన విషయం తెలిసిందే.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు గుర్తించడానికి స్పీడ్ కెమెరా, సీసీటీవీ కెమెరా, స్పీడ్ కం డాష్ బోర్డ్ కెమెరా మొదలైనవి రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అదే విధంగా ఎక్కువగా ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలు ఉన్న జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు ప్రస్తావించిన 132 నగరాలతో పాటు పది లక్షలకు పైగా జనాభా ఉన్న అన్ని నగరాల్లో ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమైంది.
అయితే రూల్స్ ని అతిక్రమించడం వల్ల ప్రమాదాలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. కనుక రూల్స్ ని బ్రేక్ చేయకుండా ఉండటం మంచిది. ఒకవేళ కనుక ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనదారులకు రాష్ట్రాల్లోని సంబంధిత విభాగాలు ఇక నుండి 15 రోజుల్లోగా ఈ-చలాన్ జారీ చేయాల్సిందిగా కేంద్రం సూచించింది.