పోలవరంపై సీఎం జగన్‌వి బూటకపు మాటలు : నిమ్మల రామానాయుడు

-

పోలవరం పునరావాసం విషయంలో సీఎం జగన్ కామెంట్లపై టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు స్పందించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణంపై జగనుకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పునరావాసం ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించాలన్నారు. అంతేకాకుండా.. పోలవరంపై సీఎం జగన్ బూటకపు కామెంట్లు చేస్తున్నారని, లక్షల కోట్లు అప్పులు చేస్తున్న జగన్.. పోలవరం పునరావాసం కోసం ఎందుకు ఖర్చు పెట్టలేదు అని ఆయన అన్నారు. పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం ఇస్తానన్న జగన్.. రూ.10 కూడా సాయం చేయలేదని, తానే తండ్రిని హత్య చేసి.. తండ్రి లేని వాడిని క్షమాభిక్ష పెట్టండనే రీతిలో జగన్ వైఖరి ఉందన్నారు. అసమర్థతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను ముంచేసిన జగన్, ఇప్పుడు ఆదుకుంటానంటూ డ్రామాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

నిరూపిస్తే అసెంబ్లీకి రాను'... నిమ్మల సవాల్

రాష్ట్రపతి ఎన్నికలు, ఇతర సందర్భాల్లో కేంద్రాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోలేదని ఆయన విమర్శించారు. పరదాల చాటునే జగన్ వరద ప్రాంతాల పర్యటన సాగిందని ఆయన ఆరోపించారు. వాలంటీర్లు ఎంపిక చేసిన వారికి మంత్రులు ముందస్తు శిక్షణ ఇచ్చి జగన్ ముందుకు బాధితుల్లా ప్రవేశపెట్టడం ఈవెంట్ మేనేజ్మెంటును తలపించిందని, నిజమైన వరద ముంపు బాధితులు సీఎంను కలవాలని ప్రయత్నిస్తే గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు చేశారని ఆయన మండిపడ్డారు. సీడబ్యూసీ ముందస్తుగా హెచ్చరించినా వరద సహాయక చర్యలు చేపట్టకుండా తాడేపల్లి ప్యాలెస్సులో జగన్ మొద్దు నిద్రపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news