NKR19 : క‌ల్యాణ్ రామ్ కొత్త సినిమా అప్‌డేట్..స‌ర్‌ప్రైజ్ లుక్ అదిరింది

-

బింబిసార సినిమాతో కల్యాణ్ రామ్ హిట్ అందుకున్నాడు. విశిష్ఠ్ దర్శకత్వంలో ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటు ప్రేక్షకులతో పాటు అటు బాక్సాఫీస్ వద్ద కూడా సూపర్ హిట్ గా నిలిచింది. హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత క‌థ నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ చిత్రంలో క‌ల్యాణ్ రామ్ బింబిసార చ‌క్ర‌వ‌ర్తిగా, దేవ‌ద‌త్తుడిగా ద్విపాత్రాభిన‌యం చేశాడు.

ఈ మూవీ బంపర్ హిట్ కావడంతో ఇప్పుడు తన తర్వాతి సినిమాలపై ఫోకస్ చేశాడు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ 19వ చిత్రం ఇది. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ ను వదిలింది చిత్రం బృందం. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయిందని చెబుతూ ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో కళ్యాణ్ రామ్ పట్టుకుని ఉండటం… ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభమవుతుందని ఆ తర్వాత వరుసగా అప్డేట్లను రిలీజ్ చేస్తామని చిత్రం బృందం.

Read more RELATED
Recommended to you

Latest news