లోక్సభలో ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇచ్చారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మణిపూర్ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్‌లో మాట్లాడారు. మణిపూర్‌లో త్వరలోనే శాంతి నెలకొంటుందని అన్నారు.
సభ ప్రజల సొమ్ముతో నడుస్తోందని, ప్రతిక్షణం అత్యంత విలువైనదని మోదీ అన్నారు. ప్రజల ధనాన్ని, సభా సమయాన్ని దుర్వినియోగం చేయకూడదని విపక్షాలకు హితవుపలికారు. రాజకీయాలు బయట చేయాలి తప్ప.. సభలో కాదని సూచించారు. దేశాభివృద్ధి, సమగ్రత కోసం ఫలవంతమైన చర్చలు జరగాలని, అందుకు విపక్షాలు సహకరించాలని మోదీ కోరారు. మరోవైపు లోక్సభలో ప్రధాని ప్రసంగం సమయంలోనే విపక్షాలు వాకౌట్ చేశాయి. ప్రధాని మాట్లాడుతుండగానే ఇండియా కూటమి ఎంపీలు లోక్సభ నుంచి బయిటికి వెళ్లిపోయారు.