భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించారు. ఈ సంవత్సరం భౌతిక శాస్త్రంలో ఏకంగా ముగ్గురికి నోబెల్ బహుమతి వరించింది. శాస్త్రవేత్తలు సుకురో మనాబో, క్లాస్ హసిల్మన్ మరియు జార్జియా పారిసి లను ఈ ఏడాది నోబెల్ బహుమతులకు ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ కాసేపటి క్రితమే కీలక ప్రకటన చేసింది.
సంక్లిష్టమైన భౌతిక వ్యవస్థలపై విశ్లేషణలకు గాను వీరికి ఈ ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డు ను అందిస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ స్పష్టం చేసింది. అయితే ఇందులో జార్జియా పారిసి కి సగం పురస్కారాన్ని ఇవ్వగా మిగతా సగాన్ని…శాస్త్రవేత్తలు సుకురో మనాబో, క్లాస్ హసిల్మన్ లకు పంచానున్నామని ప్రకటన చేసింది రాయల్ స్వీడిష్ అకాడమీ. భౌతిక శాస్త్రంలో జార్జియా పారిసి చేసిన సేవలకు.. ఆయనకు నోబెల్ బహుమతి సగాన్ని ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. కాగా ఉష్ణోగ్రత, స్పర్శ గ్రాహకాలపై పరిశోధనలు జరిపినందుకు గానూ అమెరికన్ శాస్త్రవేత్తలు డెవిడ్ జూలియస్, ఆర్డమ్ పాటపౌటియన్ లకు నోబెల్ వరించిన సంగతి తెలిసిందే.