నోకియా తన కొత్త 2660 ప్లిప్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఈ మధ్య నోకియా కీపాడ్ ఫోన్ తగ్గాయి.. మన అమ్మమ్మలకు నోకియా కీపాడ్ ఫోన్లు అంటే బాగా ఇష్టం..చాలామంది.. ఫోన్ పాడైపోయినా.. కొత్తది కూడా మళ్లీ నోకియానే కొంటారు. ఇందులో 2.8 అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లే, 1.77 అంగుళాల అవుటర్ డిస్‌ప్లే ఉండనుంది. ఇంకా ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
నోకియా 2660 ఫ్లిప్ ధర..
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 48 ఎంబీ + 128 ఎంబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.4,699గా నిర్ణయించారు. నోకియా వెబ్‌సైట్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్లలో నోకియా 2660 ఫ్లిప్ కొనుగోలు చేయవచ్చు.
నోకియా 2660 ఫ్లిప్ స్పెసిఫికేషన్లు..
డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఈ ఫోన్‌లో అందించారు.
4జీ కనెక్టివిటీ కూడా ఇందులో ఉంది.
ఈ ప్లిప్ ఫోన్ సిరీస్ 30ప్లస్ ఓఎస్‌పై పనిచేయనుంది.
ఇందులో 2.8 అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లేను అందించారు.
దీని రిజల్యూషన్ క్యూవీజీఏగా ఉంది.
మరో వైపు 1.77 అంగుళాల అవుటర్ డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ క్యూక్యూవీజీఏగా ఉంది.
48 ఎంబీ ర్యామ్, 128 ఎంబీ స్టోరేజ్ ఇందులో ఉంది.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఫోన్ వెనకవైపు 0.3 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. యూనిసోక్ టీ107 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే…
ఇందులో బ్లూటూత్ వీ4.2 సపోర్ట్, మైక్రో యూఎస్‌బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. రిమూవబుల్ బ్యాటరీతో ఈ ఫోన్ లాంచ్ అయింది. 2.75W చార్జింగ్‌ను నోకియా 2660 ఫ్లిప్ సపోర్ట్ చేయనుంది. 24.9 గంటల స్టాండ్‌బై టైంను దీని బ్యాటరీ అందించనుంది. దీని మందం 0.55 సెంటీమీటర్లు కాగా, బరువు 123 గ్రాములుగా ఉంది.