మొదటి రోజే రాష్ట్రపతి ఎన్నికకు 11 నామినేషన్లు.. అందులో..

-

ఈ సారి భారత రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠగా కొనసాగుతోంది. ఎప్పడూ అధికార పక్షం నుంచే దాదాపు ఏకగ్రీవమయ్యే రాష్ట్రపతి ఎన్నిక.. ఈ యేడు.. ప్రతిపక్షాల కూటమితో కొంత ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే.. నేడు మొదటి రోజు రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైన బుధవారం నాడే.. 11 నామినేషన్లు దాఖలు కావడం విశేషం. జూలై 23తో ప్ర‌స్తుత రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. ఈ లోగా కొత్త రాష్ట్రప‌తిని ఎన్నుకోవాల్సి ఉన్న నేప‌థ్యంలో రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు బుధ‌వారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

Who will be India's next President? - News Analysis News

ఇలా నోటిఫికేష‌న్ విడుద‌లైందో, లేదో అలా రాష్ట్రప‌తి ఎన్నిక‌కు 11 నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. రాష్ట్రప‌తి ఎన్నిక‌లు పార్ల‌మెంటు స‌హా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ పోలింగ్ నిర్వ‌హిస్తున్నా… నామినేష‌న్ల దాఖలు మాత్రం ఢిల్లీలోని పార్ల‌మెంటులోని లోక్ స‌భ సెక్ర‌టేరియ‌ట్‌లోనే కొన‌సాగుతుంది. అంతేకాకుండా ఈ ఎన్నిక‌ల్లో పాలుపంచుకునే వారిలో 50 మంది ప్ర‌తిపాదిస్తే త‌ప్పించి నామినేష‌న్లే వేయ‌డం కుద‌ర‌దు. అయినా కూడా బుధ‌వారం తొలి రోజే రాష్ట్రప‌తి ఎన్నిక‌కు 11 నామినేష‌న్లు దాఖ‌లు కాగా…వాటిలో ఓ నామినేష‌న్‌ను రిట‌ర్నింగ్ అధికారి తిర‌స్క‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news