వైఎస్ఆర్సిపి పార్టీ నుండి రాజ్యసభకు ఎన్నికైన ఆర్.కృష్ణయ్య పై హైదరాబాదులో నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయ్యింది. రౌడీలు, గుండాలతో బెదిరిస్తున్నాడు అంటూ రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూకబ్జా తో పాటు హత్యకు యత్నించాడనీ ఆర్.కృష్ణయ్య పై ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు తీసుకున్న రాయదుర్గం పోలీసులు ఆర్.కృష్ణయ్య పై 447,427,506,384 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
రీసెంట్ గా వైఎస్ఆర్సిపి పార్టీ ఆర్.కృష్ణయ్య ను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆర్.కృష్ణయ్య రాజకీయ ప్రస్థానం 2014లో తెలుగుదేశం పార్టీలో మొదలైంది. 2014లో టిడిపి పార్టీ తరపున ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్ గౌడ్ పై 12525 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారి చట్టసభలోకి అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైసిపి మద్దతుదారుగా ఏపీలో ప్రచారం చేశారు.