పెళ్లైనా కూడా తగ్గేదేలే అంటున్న స్టార్ హీరోయిన్స్..!!

-

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లి కాక ముందు వరకు తమ హవా కొనసాగించేవారు. పెళ్లయిన తర్వాత భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతల కోసం తమ సినీ కెరియర్ ను వదులుకున్న ఎంతో మంది తారలను ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం. ఒక వారంతా తమ బాధ్యతలను నెరవేర్చిన తర్వాత తిరిగి ఐదు పదుల వయసులో మళ్లీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుల అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో రూల్ మారుతోంది. హీరో సినిమా గా ఉన్న సినీ ఇండస్ట్రీ ఇప్పుడు హీరోయిన్లు కూడా ఆక్యు పై చేస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా అదే స్టార్ స్టేటస్ ను అనుభవిస్తూ హీరోయిన్లుగా కొనసాగుతుండడం గమనార్హం. ఇకపోతే ఎవరెవరు వివాహం అనంతరం కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారో వారి గురించి తెలుసుకుందాం.

నయనతార:బాక్సాఫీస్ దగ్గర నయనతార సోలో హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుంది. గత 20 సంవత్సరాల నుంచి హీరోయిన్ గా చలామణి అవుతున్న ఈమె ఇటీవల ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది. ఇక వివాహం అనంతరం కూడా తెలుగు , తమిళ్, మలయాళం తో పాటు బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం గాడ్ ఫాదర్ , అట్లీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

సమంత:వివాహానికి ముందు ఏ రేంజ్ లో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుందో.. వివాహం తర్వాత కొంత వరకు ఈమె క్రేజ్ తగ్గింది అని చెప్పాలి. ఇక విడాకులు తీసుకున్న తరువాత మరింత చెలరేగిపోయి అన్నీ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఉండడం గమనార్హం.

అలియా భట్:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇటీవల గంగూభాయ్ కతియావాడి సినిమాతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక వివాహం అనంతరం మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం డార్లింగ్స్, బ్రహ్మాస్త్ర, రాఖి ఔర్ రాణి కి ప్రేమ్ కహాని వంటి సినిమాలు చేస్తోంది.

దీపికా పదుకొనే:
పెళ్లి తర్వాత కూడా ఈమె క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం పఠాన్, ప్రాజెక్టు కే, సర్కస్ వంటి సినిమాలతో బిజీగా ఉంది దీపికాపదుకునే.. ఇక వీరితో పాటు మరింత మంది హీరోయిన్లు కూడా పెళ్ళి తర్వాత అదే రేంజిలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటూ ఉండడం గమనార్హం.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version