హ్యాపీ బర్త్ డే బావా అంటూ.. ఆ స్టార్ హీరో అల్లు అర్జున్ కి విషెస్..!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే ఈరోజు ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డుని అందుకున్న తర్వాత వచ్చిన తొలి బర్త్డే కావడం తో ఫ్యాన్స్ రెట్టింపు ప్రోత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కి అభిమానులు సినీ ప్రముఖులు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్కి బర్త్ డే విషెస్ ని తెలిపారు. హ్యాపీ బర్త్డే బావ అని అల్లు అర్జున్ కి ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు బావ ఈ సంవత్సరం మీకు సంతోషం విజయాలతో నిండాలని కోరుకుంటున్నాను అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం పుష్ప టు లో అల్లు అర్జున్ నటిస్తుండగా ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version