పాత తెలంగాణ..పాత సెంటిమెంట్…!

-

మళ్ళీ అవే కథలు…అదే సెంటిమెంట్..ఏమి మార్పు లేదు. మళ్ళీ ఎప్పటిలాగానే సెంటిమెంట్‌తో గట్టెక్కాలని సీఎం కేసీఆర్ గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు సార్లు అధికారంలోకి రావడానికి తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగపడింది. తెలంగాణ సెంటిమెంట్‌తో టీఆర్ఎస్ పెట్టిన కేసీఆర్…మొదట్లో పెద్దగా సక్సెస్ కాలేదు…కానీ నిదానంగా సక్సెస్ అవుతూ వచ్చారు..ఇక 2014లో ప్రత్యేక తెలంగాణ రావడం కేసీఆర్‌కు రాజకీయంగా కలిసొచ్చింది. తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది..కేసీఆర్ సీఎం అయ్యారు.

అయితే సెంటిమెంట్ అస్త్రం అంతటితో అయిపోయింది…ఆ తర్వాత ఎన్నికలు జరిగితే తాము చేసుకున్న పనులుని చెప్పుకుని ఓట్లు అడగాలి. కానీ అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వచ్చిన కేసీఆర్‌కు చంద్రబాబు రూపంలో ఓ అస్త్రం దొరికింది. అసలే చంద్రబాబు అంటే మంట..పైగా ఆయన…కాంగ్రెస్ ‌తో కలిసి ఎన్నికల బరిలో దిగారు.

ఇంకా అంతే అదిగో మళ్ళీ తెలంగాణలోకి ఏపీ పాలకులు వచ్చారని, మళ్ళీ తెలంగాని దోచుకుంటారని, మళ్ళీ ఏపీలో కలిపేస్తారని చెప్పి సెంటిమెంట్ లేపి ఆ ఎన్నికల్లో కేసీఆర్ లబ్ది పొంది మళ్ళీ సీఎం అయ్యారు. సరే రెండుసార్లు సెంటిమెంట్ వర్కౌట్ అయింది…ఈ సారైనా కేసీఆర్ తాను చేసిన పనులు గురించి చెప్పి ప్రజల్ని ఓట్లు అడుగుతారా? అంటే అబ్బే అదేం లేదు…మళ్ళీ అదే సెంటిమెంట్…ఈ సారి బీజేపీ టార్గెట్ గా, తెలంగాణలో బీజేపీ బలపడుతుండటంతో, ఆ పార్టీని ఎలాగైనా దెబ్బతీయాలని చెప్పి..కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్ని వాడుతున్నారు.

ఇటీవల ఏ సభలో చూసిన బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనమవుతుందని, బీజేపీ వస్తే మత కలహాలు పెరుగుతాయని, బంగారు పంటలు పండే తెలంగాణ కావాలా? మత పిచ్చితో మంటలు లేచే తెలంగాణ కావాలా? మనం మౌనంగా ఉంటే మత చిచ్చు పెట్టే శక్తులు మంటలు రేపుతాయని, ఐక్యత దెబ్బతింటే మళ్లీ పాత తెలంగాణ అవుతుందని, తాను బతికి ఉండగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వనని కేసీఆర్ మళ్ళీ అవే పాత ఉపన్యాసాలు చెబుతున్నారు. అదే పాత సెంటిమెంట్‌తో కేసీఆర్ రాజకీయం చేస్తున్నారు. అయితే ప్రతి సారి కేసీఆర్ చెప్పే మాటలని ప్రజలు నమ్ముతారు అనుకోవడం పొరపాటే.

Read more RELATED
Recommended to you

Latest news