ఇండియాలో 781 కి చేరిన ఓమిక్రాన్ కేసులు… 21 రాష్ట్రాలకు విస్తరించిన ఓమిక్రాన్..

-

ఇండియాలో ఓమిక్రాన్ కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. వేగంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. నిన్నటితో పోలిస్తే కేవలం ఒకే రోజులో కేసుల సంఖ్య 100కు పెరిగింది. ప్రస్తుతం దేశంలోని 21 రాష్ట్రాలకు ఓమిక్రాన్ కేసులు విస్తరించాయి. దేశంలో ఇప్పటి వరకు 781 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు ఓమిక్రాన్ నుంచి 241 మంది కోలుకున్నారు.

ముఖ్యంగా ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఒక్క ఢిల్లీలోనే 238 కేసులు వెలుగులోకి వచ్చాయి. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర 167 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఓమిక్రాన్ కారణంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఆంక్షల ఛట్రంలోకి వెళ్లాయి. తెలంగాణ లో 62 కేసులు నమోదవ్వగా.. 10 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

దేశంలో ఓమిక్రాన్ కేసులను పరిశీలిస్తే..  ఢిల్లీలో 238, మహారాష్ట్రలో  167, గుజరాత్ 73, కేరళలో 65, తెలంగాణలో 62,  రాజస్థాన్ 46, తమిళనాడులో 34, కర్ణాటకలోె 34, పశ్చిమ బెంగాల్ లో 11, హర్యానా 12, మధ్య ప్రదేశ్ లో 9, ఒడిశా లో 8, ఆంద్ర ప్రదేశ్ 6, ఉత్తరాఖండ్  4 కేసులు, చండీగఢ్ 3, జమ్మూ కాశ్మీర్ లో 3, ఉత్తర్ ప్రదేశ్ లో 2, గోవా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, లడఖ్ లలో ఒక్కో ఓమిక్రాన్ కేసు నమోదైంది.

Read more RELATED
Recommended to you

Latest news