దళితులను తక్కువగా చూడడం కేసీఆర్ నైజం : వైఎస్‌ షర్మిల

-

కేసీఆర్ కుటుంబసభ్యులకు ఆస్కార్ ఇవ్వాలంటూ మరోసారి నిప్పులు చెరిగా వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. మంగళవారం ఉదయం ట్యాంక్‌బండ్‌ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా నటిస్తున్నారని, మంత్రి హరీష్ రావు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఆయనవి బోగస్ మాటలు అన్న షర్మిల.. హరీష్ రావు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మర్చిపోయినట్టు నాటకాలు ఆడాడన్నారు. శ్రీకాంత చారీ అగ్గిపెట్టె తెచ్చుకొని అమరుడైతే హరీష్ అగ్గిపెట్టె మర్చిపోతే మంత్రి అయ్యాడని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోందన్నారు. అంతేకాకుండా.. ‘రాజశేఖర్ రెడ్డి చుట్టా బీడీ అని అనలేదు. రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ప్రజల కోసమే ఉచిత విద్యుత్ పై సంతకం పెట్టారు. కేసీఆర్ కుటుంబం అంతా డ్రామాలు ఆడుతున్నారు. ఆ కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. నా అరెస్ట్ పట్ల సానుభూతి వ్యక్తం చేసిన మోదీ జీ కి థాంక్స్. నా అరెస్ట్ పట్ల స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు. కవితమ్మ అమాయకంగా బతుకమ్మ ఆడుతూనే లిక్కర్ స్కాం కి తెరలేపింది.

I am YSR's daughter, they can't scare me': YS Sharmila to resume padayatra  on Sunday

కేసీఆర్ కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో నాటకానికి తెర లేపుతున్నారు. అంబేడ్కర్‌కి మా పార్టీ తరపున మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. రాష్ట్రంలో ఎస్సీ లకు ఇంకా అన్యాయం జరుగుతోంది. కేసీఆర్ మాటల్లో ఉన్న చిత్తశుద్ది చేతల్లో కనపడడం లేదు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి అంబేడ్కర్ పేరు పెడితే కేసీఆర్ దాన్ని తీసేసారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ ఆ మాట తప్పారు. పదిశాతం కూడా దలితబందు ఇవ్వలేదు. మన రాష్ట్రం సాదించుకుందే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే.
దళితులను తక్కువగా చూడడం కేసీఆర్ నైజం. దళితులను కేసీఆర్ కనీసం పక్కన కూడా పెట్టుకోడు.’ అంటూ ఆమె ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news