Big News : తెలంగాణ నిరుద్యోగులకు తీపికబురు.. మరో TSPSC నోటిఫికేషన్‌ విడుదల

గతంలో సీఎం కేసీఆర్‌ చెప్పినట్లుగా తెలంగాణలో 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 113 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అసిస్టెంట్ మోటార్ ఇన్ స్పెక్టర్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి.

TSPSC Group I notification released – Here's everything you need to know

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 5న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.tspsc.gov.inలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.