విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా జూలై 2 న హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రంలోని మూడు పార్టీల నేతలతో ఆయన విడివిడిగా భేటీ కానున్నట్లు తెలిసింది. టిఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ నేతలతో ఆయన ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. యశ్వంత్ సిన్హా మొదటగా సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నట్లు గా తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు.. మజ్లీస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా భేటీ కానున్నారు. కాగా యశ్వంత్ సిన్హా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వామపక్ష నేతలు, పలు పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.