తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్… అదనంగా మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు కేంద్రం ఓకే..

-

తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య వరి ఇష్యూ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈసారి తెలంగాణలో పెద్ద ఎత్తున పంట దిగుబడి వచ్చిందని.. కేంద్రం సేకరించే ధాన్యాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు కోరుతున్నారు. ఈ విషయమై ఇటీవల ఢిల్లీ కూడా వెళ్లారు. తాజాగా ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అదనంగా బియ్యం సేకరించేందుకు కేంద్రం సిద్ధమైంది. మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీనికి సంబంధించి కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.

ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ నుంచి కేంద్రం మొత్తం 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనుంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం 68.65 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించనుంది. నిజానికి ముందుగా చేసుకున్న ఒప్పందం మేరకు కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే కేంద్రం తీసుకుంటానని చెప్పింది. ప్రస్తుతం అదనంగా మరో 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనుంది. మొత్తం కలిసి 46 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించనుంది కేంద్రం. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం 15 నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యాన్ని సేకరించాలని కోరుతుంది. ఇప్పుడున్న 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అంటే దాదాపుగా 10 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి సమానం అని.. ఇది రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నదాని కన్నా తక్కువే అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news