ఈటల రాజేందర్ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం, పార్టీ పెద్దలు ఈటలకు మద్దతిస్తున్నారు. ఆయన పార్టీలోకి వస్తే చేర్చుకుంటామని బహిరంగంగానే స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. కానీ ఆ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారం మాత్రం అందరికీ తలనొప్పిగా మారింది. ఆయన ఈటలపై బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నాడు.
టీవీ ఛానల్ల లైవ్ డిబేట్‌కి వెళ్లిమరీ ఈటల భూ కుంభకోణం చేశారంటే పేపర్లు చూపిస్తున్నారు. ఓవైపేమో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లు ఈటలకు సపోర్టు చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.
మరి ఇలాంటి టైమ్‌లో ఉత్తమ్ కుమార్‌రెడ్డికి సమీప బంధువైన కౌశిక్‌రెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నారో అంతు చిక్కట్లేదు. ఈయన వ్యవహారం సరికాదంటూ మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ ఏకంగా అధిష్టానానికి లేఖ రాశారు. ఇంకోవైపు టీఆర్ ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈటలపై బహిరంగ ఆరోపణలు చేయట్లేదు. మరి కౌశిక్‌రెడ్డి టీఆర్ ఎస్‌లో చేరతారా అంటే అదీ లేదని ఆయనే చెప్తున్నారు. మరి ఎందుకు అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో ఆయనే ప్రకటించాలి.