మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు చాలా ముఖ్యమైనవి.
ప్రతీ ఒక్కరు కూడా పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ ని తప్పక చెయ్యాలి. 2021 సెప్టెంబర్ 30 లోగా పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చెయ్యాలి. లేకపోతే పాన్ కార్డ్ ఇనాక్టీవ్‌గా ఉంటుంది. అంటే అది చెల్లదు అని గ్రహించండి. దీనితో మీరు ఆ పాన్ కార్డుని ఉపయోగించడానికి కుదరదు.
కనుక ఆ గడువు లోగ పాన్ ని లింక్ చెయ్యండి. అయితే పాన్ ని లింక్ చెయ్యాలంటే వివిధ పద్ధతులు వున్నాయి. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో కూడా పాన్ ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు. ఇ-ఫైలింగ్ పోర్టల్ 2.0 వెబ్‌సైట్‌లో కూడా పాన్ ఆధార్ లింక్ చేసే విధానం కాస్త మారింది. దాని కోసం తెలుసుకుంటే ఈజీగా లింక్ చేసుకోచ్చు.
దీని కోసం ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/ ఓపెన్ చేయాలి.
అక్కడ హోమ్ పేజీలోనే Link Aadhaar లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
మొదట పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రెండో కాలమ్‌లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ పేరు టైప్ చేయాలి. (ఆధార్ లో ఉన్నట్టు)
ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డుపై పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే I have only year of birth in Aadhaar card అనేది సెలెక్ట్ చేయాలి.
నెక్స్ట్ మీరు I agree to validate my Aadhaar details సెలెక్ట్ చేయాలి.
తర్వాత Link Aadhaar క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి Validate పైన క్లిక్ చేయాలి.మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది అంతే.