‘ పంచతంత్ర కథలు ‘మూవీ రివ్యూ..వేశ్య పాత్ర సినిమాకు హైలెట్ అయ్యిందా?పబ్లిక్ ఏమన్నారంటే

-

సినిమా: పంచతంత్ర కథలు

నటీనటులు: నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వ‌ర్  తదితరులు

నిర్మాణ సంస్థ‌: మ‌ధు క్రియేష‌న్స్‌

నిర్మాత‌: డి. మ‌ధు

ర‌చ‌న‌-ద‌ర్శక‌త్వం: గంగ‌న‌మోని శేఖ‌ర్‌

సంగీతం: క‌మ్రాన్‌

సినిమాటోగ్ర‌ఫి: గంగ‌న‌మోని శేఖ‌ర్‌, విజ‌య్ భాస్క‌ర్ స‌ద్దల‌

ఎడిట‌ర్‌: శ్రీ‌నివాస్ వ‌ర‌గంటి

పంచతంత్ర కథలు..వీటి గురించి మనం చిన్నప్పుడు నేర్చుకోని ఉంటాము.. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తారు..వాటి ద్వారా నీతి అనేది నేర్చుకుంటారు.అలాంటి క‌థ‌ల ఇన్సిపిరేష‌న్ తో తెర‌కెక్కిన ఆంథాలజీ చిత్రం ‘పంచ‌తంత్ర క‌థ‌లు’. గంగ‌న‌మోని శేఖ‌ర్ దర్శకత్వం వహించిన  ఈ చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మించారు. నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వ‌ర్ ముఖ్య పాత్ర‌లు పోషించారు..ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమా రివ్యూ, పబ్లిక్ టాక్ ఎలా ఇప్పుడు చూద్దాం…

కథ, విశ్లేషణ:

కృష్ణ(నిహాల్‌) అనే యువకుడు క్షవర వృత్తి చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అదే వీధిలో ఉంటున్న యువతిని సత్య(సాదియ అన్వర్‌) ప్రేమిస్తాడు. వేరు వేరు కులాలకు చెందిన వీరిద్దరి ప్రేమకు పెద్దల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి.ఇంతకీ వారి ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా అనేది సినిమా కథ..

సమాజం ఇంతగా అభివృద్ధి చెందిన, కాలం తో పాటు పరుగులు పెట్టిన కూడా కుల పిచ్చి అనేది వదల్లేదు..నేటికీ సమాజం లో తంతు ఉంది..ఈ సినిమా కూడా అదే కథ..విషయాన్నికొస్తే.. ఈ సినిమాలోరేవతి (ప్రణీత పట్నాయక్) ఓ వేశ్య. తన  కుటుంబాన్ని పోషించుకోవడానికి ప‌డుపు వృత్తిని ఎంచుకుంటుంది. ఆమెకు పెయింటింగ్‌ ఆర్టిస్ట్‌ అయోధ్య(అజయ్ )పరిచయం అవుతాడు. అతని పరిచయంతో ఆమె తనలో మార్పు వస్తుంది. వేశ్య వృత్తిని వదిలేసి మంచి మనిషిగా బతకాలనుకుంటుంది. అలాంటి సమయంలో సమాజం నుంచి రేవతికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి.. చివరకు ఆమె జీవితం ఎలా మలుపులు తిరుగుతుంది.. ఓ వేశ్య మాములు మనిషిగా బతకాలని చూస్తే ఆమెను సమాజం ఎలా చూస్తుంది? అనేదానిని తెరపై చక్కగా చూపించారు. వేశ్య వృత్తికి ఎంత దూరంగా ఉండాలని చూసినా.. ఆ మార్పును సమాజం అంగీకరించదు. అందు కోసం వాళ్లు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోందనేది కళ్ళకు కట్టినట్లు చూపించారు.. సినిమా క్లైమాక్స్ అందరినీ కంటతడి పెట్టిస్తుంది..సినిమాకు వేశ్య పాత్ర హైలెట్ అయ్యింది.

ఈరోజుల్లో లగ్జరీ లైఫ్ కోసం అమ్మాయిలు పెద్ద సాహాసాలు చేస్తున్నారు..డబ్బున్న వారిని చూసుకొని పెళ్ళి చేసుకొని వెళితే.. ఆమె తర్వాత పడే కష్టాన్ని డైరెక్టర్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడు..సినిమా టైటిల్ కు తగ్గట్లే అన్నీ కథలను, అన్ని రకాల ఎమోషన్స్ ను సినిమాలో చూపించారు.ఈ సినిమాలో రొమాన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. మొత్తంగా ఐదు కథలు సినిమాలో కనిపిస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా వారి పాత్రకు న్యాయం చేశారు..

మంచి సందేశాన్ని ఇచ్చాయి. ఒక్కో కథలో ఓక్కో నీతి ఉంది.  ద‌ర్శ‌కుడు ఎంచుకున్న క‌థ‌లు… వాటిని న‌డిపించ‌డానికి రాసుకున్న స్క్రీన్ ప్లే బాగున్నాయి. స‌య్య‌ద్ క‌మ్రాన్ అందించిన సంగీతం చిత్రానికి బాగా ప్ల‌స్ అయింది. మొదటి కథలో వచ్చే మోతెవారి పాటతో ప్రేక్షకుల్లో జోష్‌ నింపుతుంది. మిగిలిన పాట‌లు కూడా  బాగున్నాయి. డైరెక్టర్ గంగ‌న‌మోని శేఖ‌ర్ యే సినిమాటోగ్రాఫ‌ర్ కావ‌డంతో మంచి విజువ‌ల్స్ తీశారు. దీనికి మ‌రో సినిమాటోగ్రాఫ‌ర్ విజ‌య్ భాస్క‌ర్ స‌ద్దల కూడా త‌న వంతు స‌హ‌కారం అందించారు.  శ్రీ‌నివాస్ వ‌ర‌గంటి ఎడిటింగ్ పర్వాలేదు. సాధారణంగా ఏ నిర్మాత అయినా తన తొలి చిత్రాన్ని కమర్షియల్‌ ఫార్మెట్‌లో నిర్మిస్తాడు..సినిమాలో మంచి మెసేజ్ ను ఇస్తాడు..ఓవర్ ఆల్ గా సినిమా బాగుందనే టాక్..మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకున్నారు..

రేటింగ్: 2.5/5

Read more RELATED
Recommended to you

Exit mobile version