రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..షెడ్యూల్ ఇదే

-

రేపటి నుంచి పార్ల మెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు విడతలుగా ఈ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. రేపటి (జనవరి 31) నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు మలివిడత బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి.

రాజ్యసభ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమావేశం జరుగనుంది. లోక్‌సభ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశం జరుగనుంది. “కోవిడ్” నిబంధనల కారణంగా, ప్రతి సభ సభ్యులు విడివిడిగా, ఉభయ సభల్లోనూ కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు.

రేపు (జనవరి 31 వ తేదీ) ( సోమవారం ) ఉదయం 11 గంటలకు “సెంట్రల్ హాల్” లో ఉభయసభల సభ్యులనుద్దేశించి ప్రసంగించ నున్నారు రాష్ట్ర పతి రామనాధ్ కోవింద్. మంగళవారం (ఫిబ్రవరి 1 వ తేదీ) ఉదయం 11 గంటలకు లోక్‌ సభ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం…తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version