ఆ సీట్లపై పవన్ ఫోకస్..గెలుపు ఫిక్స్?

-

ఏపీలో జనసేన బలం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఆ పార్టీకి పూర్తి స్థాయిలో బలం లేదని గత ఎన్నికల్లోనే రుజువైంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీ కేవలం ఒకే ఒక సీటుని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ తరుపున గెలిచిన ఎమ్మెల్యే తర్వాత వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో ఆ పార్టీకి ఏ మాత్రం బలం లేకుండా పోయింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కొన్ని సీట్లలో సత్తా చాటాలని చెప్పి జనసైనికులు చూస్తున్నారు. ఎలాగైనా కొన్ని సీట్లని గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు.

పొత్తు ఉన్నా సరే, లేకపోయినా సరే ఆ సీట్లు మాత్రం వదలకూడదని జనసేన అనుకుంటుంది. ఇప్పటికే అధినేత పవన్ కల్యాణ్, ఆ సీట్లలో బలమైన నాయకులని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఆ సీట్లని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సమాచారం. నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందో ఉండదో..ఇప్పటిలో క్లారిటీ రావడం లేదు. పొత్తు ఉంటే ఆ సీట్లు జనసేన తీసుకుని గెలవాలని చూస్తుంది. ఒకవేళ లేకపోయినా సరే…ఆ సీట్లలో సింగిల్‌గా అయిన గెలవాలని పవన్ భావిస్తున్నారు.

అలా జనసేన ఫోకస్ చేసిన సీట్లు కొన్ని ఉన్నాయి…కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్, కైకలూరు..పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం..తూర్పు గోదావరిలో రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, కాకినాడ రూరల్, సిటీ, పెద్దాపురం..విశాఖపట్నంలో భీమిలి, గాజువాక, విశాఖ నార్త్, ఈస్ట్.. గుంటూరులో తెనాలి, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు సీట్లపై పవన్ ఫోకస్ పెట్టారు.

గత ఎన్నికల్లో ఈ సీట్లలో జనసేనకు ఓట్లు ఎక్కువగా పడ్డాయి. అందుకే ఈ సీట్లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే పొత్తు ఉంటే ఈ సీట్లని ఖచ్చితంగా తీసుకోవాలని పవన్ భావిస్తున్నారు. ఇక ఈ సీట్లలో ఖచ్చితంగా గెలవాలని చూస్తున్నారు. చూడాలి మరి ఈ సీట్లలో జనసేన సత్తా చాటుతుందో లేదో?

Read more RELATED
Recommended to you

Latest news