జగన్ కి పవన్ సూచన.. అల్లూరి సీతారామరాజు జిల్లా..!

-

ఈ రోజు మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి. ఈ సందర్భంగా ఆ పోరాట యోధుడికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. పీడిత వర్గాల్లో చైతన్యం రగిలించి, గుండెల్లో ధైర్యాన్ని నింపి బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడిన మహావీరుడు అల్లూరి సీతారామరాజును తెలుగునేల ఎన్నటికీ మరువదని పేర్కొన్నారు.

ఆ సాహసి పోరును, పోరాట పంథాను నాడు కొందరు నాయకులు, కొన్ని పత్రికలు హర్షించకపోయినా ఆయన భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఆయన జన్మించిన పాండ్రంగి గ్రామాన్ని ఒక సందర్శనీయ క్షేత్రంగా అభివృద్ధి చేయాలని, జిల్లాల పునర్విభజనలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టాలని పవన్ ఏపీ ప్రభుత్వానికి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news