బీజేపీ అభ్యర్థులను గెలిపించండి : పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను ఆశీర్వదించాలని… ఒక మార్పు కోసం ఈ పోరాటం జరుగుతోందని స్పష్టం చేశారు. జనసేన తో మైత్రి ఉన్న బీజేపీ కొన్ని స్థానాల్లో పోటీ చేస్తోందని… మన బిడ్డలకు పాతికేళ్ల భవిష్యత్తు కోసం పరితపించే జనసేన అభ్యర్థులకు ఓటేసి ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్.

మిత్ర పక్షం బీజేపీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నానని ప్రకటన చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జన సైనికులు పదవుల కోసం కాకుండా సేవచేయడానికే ముందుంటారని.. ప్రజల కోసం పని చేసే వారికే అభ్యర్థులుగా నిలబెట్టామనీ స్పష్టం చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడేవారినే ఈ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేస్తున్నారని తెలిపారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకున్న అభ్యర్థులు పోటీలో నిలిచారన్నారు. స్థానిక సమస్యలపై అవగాహనతో, సామాజిక స్పృహతో పని చేసేవారిని స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఎన్నుకొంటే ప్రజా గళం ప్రతిధ్వనిస్తుందని పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.