ఏపీలో పవన్ కల్యాణ్ దూకుడు పెంచనున్నారు…ఇప్పటివరకు అప్పుడప్పుడు మాత్రమే పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటం చేసిన పవన్…ఇకపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి రాజకీయం చేయనున్నారు. ఇప్పటికే పార్టీ బలోపేతంపై పవన్ దూకుడు పెంచారు..పొత్తుల సంగతి ఎన్నికల ముందు చూసుకుందామని తేల్చి చెప్పేసిన పవన్…ఇప్పుడు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు.
అలాగే పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై ఇంకా ఎక్కువ పెట్టి పనిచేసేలా జనసేన నేతలకు దిశానిరేశం చేశారు..దీంతో పార్టీ బలంగా ఉన్న స్థానాలని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో పవన్ పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ స్ట్రాంగ్ గా ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరిపై పవన్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో జిల్లాలో జనసేనకు ఓట్లు బాగానే పడ్డాయి…దాదాపు ఒక్కో నియోజకవర్గంలో 25 వేల పైనే ఓట్లు పడ్డాయి. ఏదో నాలుగైదు స్థానాలు మినహా మిగిలిన చోట్ల 25 వేల పైనే ఓట్లు వచ్చాయి.
ఇక అలాంటి స్థానాలనే జనసేన టార్గెట్ పెట్టుకుని, ఆ స్థానాల్లో గెలవాలని చూస్తుంది. రాజోలు సీటు ఎలాగో గత ఎన్నికల్లో జనసేన ఖాతాలో పడింది..కానీ అక్కడ గెలిచిన రాపాక వరప్రసాద్…తర్వాత వైసీపీలోకి వెళ్లారు. అయినా సరే రాజోలులో జనసేన బలం తగ్గలేదు..నెక్స్ట్ ఈ సీటు ఎలాగైనా కైవసం చేసుకోవాలని జనసేన చూస్తుంది. అలాగే అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం లాంటి స్థానాల్లో జనసేనకు ఓట్లు బాగా పడ్డాయి. ముఖ్యంగా అమలాపురం, ముమ్మిడివరం సీట్లలో జనసేనకు బాగా పట్టు ఉంది. ఇక రెండు సీట్లని సైతం కైవసం చేసుకోవాలని పవన్ చూస్తున్నారు. అటు కాకినాడలో కనీసం ఏదొక సీటుని దక్కించుకోవాలని అనుకుంటున్నారు. అయితే టీడీపీతో పొత్తు ఉంటే కనీసం..జిల్లాలో 7-8 సీట్లు తీసుకుని గెలవాలని పవన్ భావిస్తున్నారు. మరి చూడాలి తూర్పులో జనసేన సత్తా చాటుతుందో లేదో.