తాము అధికారంలోకి వస్తే..ప్రస్తుతం ఉ న్న సంక్షేమ పథకాలు యథావిథిగా కొనసాగిస్తామని, ఇసుకను ఉచితంగా ఇస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని, గొడవలు తప్ప రాష్ట్రాభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని పేర్కొన్నారు. జగనన్న ఇళ్ల దోపిడీ గురించి ప్రధాని మోదీకి స్వయంగా వివరిస్తానని చెప్పారు. ఎవరు అవినీతికి పాల్పడినా.. జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని సీఎం జగన్ ఉద్దేశించి అన్నారు. విజయనగరం జిల్లా గుంకలాంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీని పరిశీలించిన సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.
జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీలపై జనసేన లోపాలను ఎత్తి చూపిస్తుంది. జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం చేపట్టారు. జగనన్న కాలనీల పేరిట పేదలకు జరిగిన మోసాన్ని నిలదీయండని ప్రజలకు పిలుపునిస్తున్నారు. అయితే జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం వైజాగ్ నుండే మొదలు పెట్టడం గమనార్హం. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అని జగనన్న కాలనీల్లో అనేక అరాచకాలు జరిగాయని జనసేన విమర్శిస్తోంది. లబ్ధిదారుల కేటాయింపు పారదర్శకంగా జరగ లేదని, దీనిపై సోషల్ ఆడిట్ చేయనున్నారు. #JaganannaMosam అనే హ్యాష్ ట్యాగ్ తో పవన్ కళ్యాణ్ ఫైట్ స్టార్ట్ చేశారు.
ఈ నెల 12, 13, 14 తేదీల్లో ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో కార్యక్రమం#JaganannaMosam హ్యాష్ ట్యాగ్ తో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయండి. అంతేకాదు http://G.O,MS,NO.8 ప్రకారం 28 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే డి ఫ్యాక్టో సిఎమ్ లెక్కల ప్రకారం నిర్మిస్తున్న ఇళ్లు 21 లక్షలేనని మిగతా ఇల్లు ఏమయ్యాయని జనసేన ప్రశ్నించింది.