ఆ ఒక్క పనితో అందరి హీరోల రికార్డులు బద్దలు కొట్టేసిన పవన్ కళ్యాణ్!

-

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలకు గ్యాప్ ఇస్తే సంవత్సరాల పాటు ఇటు చూడని పవన్ కళ్యాణ్ మరి కొన్నిసార్లు మాత్రం ఒకేసారి పలు ప్రాజెక్టులకు సైన్ చేస్తూ అందర్నీ షాక్కు గురిచేస్తారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇవన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా తాజాగా పవన్ కళ్యాణ్ ఓ కొత్త రికార్డును క్రియేట్ చేశారు.

Pawan Kalyan to give a break to Vakeel Saab; Here's why - Telugu Rajyam

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా వినోదాయ సీతమ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుని పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు పవన్. నిన్నటితో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి కేవలం 22 రోజుల్లో ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసి రికార్డులు సృష్టించారు. ఇప్పటివరకు అది తక్కువ రోజుల్లో సినిమాను కంప్లీట్ చేసిన హీరోలు అందరి రికార్డులు అయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అలాగే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. జులై 28న ఈ సినిమా విడుదల కానున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాతో పాటు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హర హర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో సైతం పవన్ కళ్యాణ్ నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రభాస్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తుండగా ఈ సినిమా మే లో ప్రారంభం కానున్నట్టు సమాచారం. కాగా ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసి త్వరలోనే మళ్లీ రాజకీయాల్లో పవన్ బిజీ కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news