ఇవాళ బేగంపేటలోని కంట్రీ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రశ్నేలేదని పవన్ ఖేరా అన్నారు. కర్నాటక తరహాలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ బలపడుతున్నదన్నా రు. ప్రజానుకూల ఎజెండాతో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎ స్ తోనూ తమ ఎన్నికల పోరాటమని చెప్పారు. . కేసీఆర్ మొదట తెలంగాణలో వంద సీట్లు గెలిచాక ప్రధానమంత్రి పదవి గురించి మాట్లాడాలన్నారు.
కర్ణాటకలో తమ కాంగ్రెస్ పార్టీ చారిత్రక విజయం సాధించిందని పవన్ ఖేరా తెలిపారు. గత 9 సంవత్సరాలలో బీజేపీ నిత్యవసర సరుకుల ధరల్ని విపరీతంగా పెంచేసి, పేదలను ఇబ్బందుల్లో నెట్టిందని విమర్శించారు. ప్రధాని మోడీ ఎన్ని ర్యాలీలు చేసినా.. ప్రజలు మాత్రం ఆదరించలేదని కౌంటర్లు వేశారు. మోడీ ర్యాలీ చేసిన చోట కూడా బీజేపీని ఓడించారని చురకలంటించారు. టిప్పు సుల్తాన్ మొదలుకొని, కేరళ స్టోరీ లాంటివన్నీ బీజేపీ ప్రదర్శించిందని.. అయితే కర్ణాటక ప్రజలు ఆ పార్టీని ఓడించి, తగిన సమాధానం చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా కర్ణాటక ఫలితాలే రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీ స్కీమ్‌లు ఇచ్చామన్నారు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో.. ఇచ్చిన హామీలను మొదటి క్యాబినెట్‌లోనే అమలు చేశామని గుర్తు చేశారు.