జనసేన ప్రభుత్వాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత ధీమా వ్యక్తం చేశారు పవన్‌కల్యాణ్. మంగళగిరిలో కార్యకర్తల సమావేశంలో ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడుతూ ఎంఐఎం హైదరాబాద్లో ఏడు స్థానాలకే పరిమితమైనా.. ఆ పార్టీ ప్రాధాన్యత అలాగే ఉందన్నారు జనసేనాని. జనాదరణ ఉన్నా 10 స్థానాలు కూడా రాకుంటే ఏం చేయలేం. కష్టాల్లో పవన్ గుర్తుకొస్తాడు.. ఎన్నికలప్పుడు మర్చిపోతారని నిర్వేదంగా మాట్లాడారు.
పవన్ మాట్లాడుతూ ఇప్పటికీ 140 నియోజకవర్గాల్లోని మండలాలకు అధ్యక్షులు లేరని, మిగిలిన 35 నియోజకవర్గాల్లోని మండలాలకు త్వరలో నియమిస్తామని చెప్పారు. సమస్యలపై నిజంగా పోరాటం చేసే వారే రాజకీయాల్లోకి రావాలని కలగన్నానని పేర్కొన్నారు. తాను నాయకత్వం వహిస్తున్నా పార్టీలో కార్యకర్తను మాత్రమేనని చెప్పారు. డబ్బులు లేకుండా రాజకీయ చేయడం ఎలానో నిరూపించామన్నారు. పార్టీ ప్రారంభంలో ఓట్లు లేకుండా రాజకీయం చేయాలని చెప్పానని గుర్తు చేశారు. జనసైనికుల ఎల్ఐసీ పాలసీ కోసం రూ.1 కోటి ఖర్చు చేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.