వైసీపీ సర్కార్ పై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఫైర్ అయ్యారు. పుట్టబోయే పిల్లలకు కూడా జగన్ పేరు పెట్టాలని జీవో తెచ్చేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి.. ఇవాళ వచ్చే కాగ్ నివేదికల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఎన్టీఆర్ పేరు తొలగింపు అంశాన్ని తెరపైకి తెచ్చారని అగ్రహించారు.
ఇప్పటికే మాంసం కొట్ల నుంచి మరుగుదొడ్ల వరకూ జగన్ పేరు పెట్టుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
సొంత పార్టీ నేతలకు ఆన్లైన్ ఓటింగ్ పెడితే ఎన్టీఆర్ పేరు తొలగింపును వ్యతిరేకిస్తారని విమర్శించారు. స్టిక్కర్ సీఎం గా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతారు.. రాష్ట్రంలో వైఎస్సార్, జగన్ పేరు తప్ప మరో పేరు పెట్టకూడదా..? అని నిలదీశారు. ఎన్నో ప్రభుత్వాలకు ఎన్టీఆర్ మార్గదర్శకంగా నిలిచారు… ఎన్టీఆర్ ఆలోచనలతో పుట్టి ఆయనే ఛాన్సలరుగా కొనసాగిన యూనివర్సిటీ కి పేరు తొలగిస్తారా ? అని ప్రశ్నించారు. చేసే పనికంటే పేర్లు మార్చేందుకే జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారు.. వైద్య రంగంతో పాటు అనేక రంగాలకు ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు ఆదర్శం అన్నారు.