పెద్దిరెడ్డి కుటుంబం రూ.30వేల కోట్లు దోచేసింది: చంద్రబాబు నాయుడు

-

పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూ స్థాపితం చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ…మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

నల్లారి కుటుంబానికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. కిరణ్‌కుమార్‌రెడ్డికి, పాపాల పెద్దిరెడ్డికి అసలు పోలిక ఉందా? అని ప్రశ్నించారు. కిరణ్ కుమార్‌రెడ్డి ఎంపీ అయితే.. పెద్దిరెడ్డికి నిద్ర పట్టదు. అతని ఆధిపత్యానికి కిరణ్‌ కుమార్‌రెడ్డి చెక్‌ పెడతారు అని అన్నారు.ఇసుక, మద్యం వ్యాపారాలతో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం అవినీతి చేసి రూ.30వేల కోట్లు దోచేసిందని చంద్రబాబు ఆరోపించారు. ‘జగన్ సీఎం అయ్యాక మద్యం,కరెంటు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచారు.పెంచిన మద్యం ధరల్లో జగన్, పెద్దిరెడ్డి వాటా ఎంతో చెప్పాలి . జూన్ 4 తర్వాత వారి నుంచి అవినీతి సొమ్మును కక్కించి పేదలకు పంచుతాం’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version