రెండు పార్టీల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కోరారు. కాషాయ పార్టీ మేనిఫెస్టోను బోగస్ అని సిద్ధరామయ్య అభివర్ణించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాషాయ పార్టీ ఇచ్చిన ఎన్నికల కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోను సిద్ధరామయ్య తోసిపుచ్చారు. హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని దుయ్యబట్టారు. తాము రేపు తమ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్నామని ఆయన వెల్లడించారు. బీజేపీ మేనిఫెస్టో బోగస్..తాము వెల్లడించే మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామని సిద్ధరామయ్య సోమవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఉన్న వ్యత్యాసం అదేనని చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 600 హామీలను గుప్పించి కేవలం 55 హామీలనే అమలు చేసిందని అన్నారు.
తాము ప్రజలకు 165 హామీలు ఇస్తే వాటిలో 158 హామీలను నెరవేర్చామని గుర్తుచేస్తూ రెండు పార్టీల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మంగళవారం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. మరోవైపు బీజేపీ మేనిఫెస్టోను పలువురు కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు. ఉచితాలను నిషేధిస్తామని చెప్పిన కాషాయ పార్టీ ఉచిత ఎల్‌పీజీ సిలిండర్ల హామీని ఎందుకు ఇచ్చిందని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నిలదీశారు. కర్నాటక ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన బీజేపీ నేతలు ఉచితాలపై ఆశలు పెట్టుకున్నారని అన్నారు. బీజేపీ మేనిఫెస్టోపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె విరుచుకుపడ్డారు. కాషాయ పార్టీ మేనిఫెస్టోలో సామాన్యుడికి మేలు చేసే పధకాలు లేవని దుయ్యబట్టారు.