చాలా మంది వాళ్ళ దగ్గర వుండే డబ్బులని బ్యాంకులో పెడుతూ వుంటారు. ముఖ్యంగా బ్యాంక్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా చేస్తూ వుంటారు. దీని వలన మంచిగా వడ్డీ కూడా వస్తుంది. అయితే ఇలా చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం జరుగుతుంది. మీరు కూడా మీ డబ్బుని బ్యాంకులో దాచుకోవాలని అనుకుంటే కచ్చితంగా వీటిని తెలుసుకోవాలి. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.
ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బులు పెట్టడం వలన ఏ రిస్క్ ఉండదు. అలానే కచ్చితమైన రాబడి వస్తుంది. రూ.5 లక్షల వరకు డబ్బులకు సేఫ్టీ కూడా ఉంటుంది. కనుక ఏ భయం లేదు. అలానే ఎంత కాలం డబ్బులు దాచుకోవాలని అనుకుంటున్నారో మొదట తెలుసుకోండి.
ఒక్కసారి డబ్బులు ఎఫ్‌డీ చేసాక మెచ్యూరిటీ దాకా తీసుకోకండి. ముందే తీసుకుంటే చార్జెస్ పడతాయి గమనించండి. అలానే వడ్డీ కూడా తగ్గిపోతుంది. లాభం కూడా దీని వలన రాదు. ఎఫ్‌డీల వడ్డీ రేట్లు బ్యాంక్ ప్రాతిపదికన మారతాయి. కాబట్టి ఎక్కువ వడ్డీ వచ్చే చోటే పెట్టండి.
ఎంచుకునే టర్మ్ ప్రాతిపదికన వడ్డీ రేటు కూడా మారుతుంది కనుక ఇది కూడా చూసుకోండి. ఎఫ్‌డీ ఖాతా తెరిచిన వారికి రుణ సదుపాయం ఉంటుంది. ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ పొందొచ్చు. కనుక మీ ఖాతా వున్న బ్యాంక్ లో ఈ సదుపాయం వుందో లేదో చూసుకోవడం మంచిది.