మాములుగా టీ 20 ఫార్మాట్ లో బౌలర్లు ఎంత కింగ్ లు అయినా పరుగుల వరద తప్పదు. ఎక్కువగా భారీ స్కోర్ లు నమోదు అవుతూ ఉంటాయి. కానీ ఈ స్కోర్ లను ఛేదించడం అంతా ఈజీ కాదు, ఎంతో చాకచక్యంగా బ్యాటింగ్ చేస్తూ వికెట్లను కాపాడుకుంటూ ఆడితేనే ఎంత భారీ టార్గెట్ అయినా చేధించగలరు. కాగా ఈ ఐపీఎల్ లో భారీ టార్గెట్ ల ముందు పెద్ద టీం లు సైతం చతికిలపడుతున్నాయి. ఈ అంశంపైన మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ధోని లాంటి అతగాడిని చూసి ఈ యువకులు అంతా ఎలా ఛేజింగ్ చేయాలో నేర్చుకోవాలన్నారు. ఎంత స్కోర్ అయినా చివరి ఓవర్ వరకు క్రీజులో ఉండేలా ఆటను మలుచుకోవాలన్నాడు.
పీటర్సన్: భారీ టార్గెట్ ను ఛేజ్ చేయడం ఎలాగో ధోని చూసి నేర్చుకోండి !
-