నీ కక్కుర్తి తగలేయ్య.. విమానాన్ని గాల్లోనే పెట్టి ట్రైనీ పైలట్‌తో శృంగారం..

కాదేది రొమాన్స్‌కు అనర్హమైన చోటు.. అన్నట్లుగా.. ఓ పైలట్‌ గాల్లో విమానాన్ని పెట్టి.. ట్రైనీ పైలట్‌తో శంగారంలో మునిగి తేలాడు.. ట్రైనీ పైలట్‌కు ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని చెప్పి ఆశ చూపిన ఓ శిక్షణ పైలట్ విమానం గాల్లోనే ఉండగానే ఆమెతో రాసలీలకు దిగాడు. విమానాన్ని ఆటోపైలట్ మోడ్‌లో పెట్టి ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోయాడు. రష్యాలో జరిగిందీ ఘటన. 21 ఏళ్ల ట్రైనీ పైలట్‌కు శిక్షణ ఇస్తున్న పైలట్ (28) తన కోరిక తీరిస్తే మరిన్ని ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని ఆశ చూపాడు. తొలుత ఆమె నిరాకరించినా ఆ తర్వాత అతడికి లొంగిపోయింది. దీంతో విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో పెట్టాడు. ఆపై ఇద్దరూ రాసలీలలకు దిగారు. అంతేకాదు, మొబైల్‌లో తమ శృంగారం మొత్తాన్ని రికార్డు కూడా చేసుకున్నారు.

Russian Pilot Fired After Getting Caught Having Sex With Student In Cockpit

ఈ విషయం బయటకు రాకుండా రహస్యంగా ఉండిపోయేదే. అయితే, ఆ ట్రైనీ పైలట్ తన తోడి కేడెట్‌తో గొడవపడింది. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె ఈ వీడియోను బయటపెట్టేసింది. దీంతో విషయం కాస్తా బయటకు వచ్చేసింది. వెంటనే అప్రమత్తమైన ఫ్లైయింగ్ స్కూల్ పైలట్‌ను, ట్రైనీ పైలట్‌ను బహిష్కరించింది. ఇదే విషయమై తొలుత ఆ ట్రైనీ పైలట్ మాట్లాడుతూ.. తాము ముద్దులు, కౌగిలింతలకే పరిమితమయ్యామని చెప్పింది. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత మాట మారుస్తూ ‘అలా’ ఒకసారే జరిగిందని చెప్పుకొచ్చింది.