అవసరం లేకుండా బియ్యం తీసుకుని..కేంద్రం ఏం చేసుకుంటుంది : పీయూష్‌ గోయల్‌

-

ధాన్యం కోనుగోలు పై కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరం లేకుండా బియ్యం తీసుకుని..కేంద్రం ఏం చేసుకుంటుందని వ్యంగ్యంగా మాట్లాడారు. ఇవాళ ఆయన ధాన్యం కోనుగోళ్లపై రాజ్యసభలో మాట్లాడారు. నాలుగు సంవత్సరాల నుంచి పారా బాయిల్డ్ రైస్ గో డౌన్ల లోనే ఉన్నాయని.. మిగులు బియ్యం ముడి బియ్యం అయితేనే తీసుకుంటామని స్పష్టం చేశారు.

లేదంటే మీ రాష్ట్రాలలోనే బియ్యాన్ని పంపిణీ చేసుకుంటూ చురకలంటించారు. ఎగుమతులపై డబ్ల్యూటీఓకు ఆంక్షలు ఉన్నాయని.. కేంద్రానికి అనుమతి లేదని చెప్పారు. ఆహార భద్రత కింద తీసుకునే ముడి బియ్యం ఎగుమతులు చేయలేమని.. పీయూష్‌ గోయల్‌ తెలిపారు.పారా బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాత పూర్వకంగా ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా వడ్ల సేకరణ అంశాన్ని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం దమ్కీ ఇస్తోందని నిప్పులు చెరిగారు పీయూష్‌ గోయల్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version