అన్నదాతలకు గుడ్ న్యూస్..నేడే రైతుల అకౌంట్ లోకి డబ్బులు..!

-

అన్నదాతలకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన డబ్బుల కోసం చాలా మంది రైతులు చూస్తున్నారు. అయితే వారందరికీ ఈరోజు డబ్బులు పడనున్నాయి. ఇక పూర్తి వివరాలను చూస్తే.. దీపావళికి ముందే 12వ విడత డబ్బులు అన్నదాతలకు ఇవ్వాలని అనుకుంది ప్రభుత్వం. దీనితో అక్టోబర్‌ 17న అనగా ఈరోజు రైతుల అకౌంట్ లోకి డబ్బులు చేరనున్నాయి.

8.5 కోట్ల మందికిపైగా ఈ స్కీమ్ కింద లాభాలను పొందుతున్నారు. ఇది ఇలా ఉంటే 2019 జూన్ నుంచి పథకాన్ని రైతులు అందరికీ అందుబాటులో ఉంచారు. ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు తొలి విడత డబ్బులు వచ్చాయి.

ఈ స్కీమ్ కింద చేరాలంటే ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, మొబైల్ నెంబర్, పేరు, కేటగిరి, జెండర్ వివరాలు అవసరం అవుతాయి. అలానే స్టేటస్ ని తెలుసుకోవాలంటే రైతులు155261 నంబర్‌కు డైల్ చేసి స్టేటస్ ని తెలుసుకోవచ్చు.

అకౌంట్ లో డబ్బుల గురించి ఇలా చెక్ చెయ్యండి:

డబ్బుల వివరాలను చెక్ చేసేందుకు ముందు వెబ్‌సైట్ కి వెళ్లాలి.
‘ఫార్మర్స్ కార్నర్’ ని తరవాత ఎంపిక చేయండి.
ఆ తరవాత ‘బెనిఫిషియరీ స్టేటస్’ మీద క్లిక్ చేయాలి.
ఆ తరవాత మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నుండి ఒకటి సెలెక్ట్ చేసుకుని డేటాపై క్లిక్‌ చేయగానే డీటెయిల్స్ వస్తాయి.

ఈ స్కీమ్ లో భాగంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6 వేలు అందిస్తోంది. చాల మంది రైతులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందుతున్నారు. అర్హత కలిగిన రైతులకు ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల రూపంలో బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతూ వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version