ఇటీవల బ్రిటన్‌లోని బర్మింగ్‌హమ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సారి కామన్వెల్త్ గేమ్స్‌లో 22 స్వర్ణ పతకాలను భారత ఆటగాళ్లు సాధించారు. అందులో బాక్సింగ్ విభాగంలో నిఖత్ జరీన్ తన పంచ్ పవర్‌తో గోల్డ్ సాధించింది. అయితే.. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పసిడి పతకాన్ని సాధించి పెట్టిన తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా ఆమెకు గ్లౌజులను మోడీ బహూకరించారు.
శనివారం కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తరఫున పాలుపంచుకున్న క్రీడాకారులతో ప్రత్యేకంగా భేటీ అయిన మోదీ…వారి ప్రతిభను కీర్తించారు. ఈ దఫా కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ క్రీడా సంబరాలు ముగియగా… క్రీడాకారులంతా దేశం చేరుకున్నారు. వీరందరినీ ఢిల్లీకి పిలిపించిన మోదీ… దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన క్రీడాకారులను ఆయన మెచ్చుకున్నారు. ఈ సందర్భంగానే నిఖత్ జరీన్‌ను ప్రత్యేకంగా సన్మానించిన మోదీ… ఆమెకు గ్లౌజులను బహూకరించారు.
Some more glimpses from the memorable interaction with India's athletes, who have made us proud at the 2022 CWG. pic.twitter.com/hRlTFJDVru
— Narendra Modi (@narendramodi) August 13, 2022